Header Banner

12వేల అడుగుల ఎత్తులో టెక్నికల్ ఫాల్ట్... ప్రయాణికులకు ఆందోళన!

  Mon Jun 16, 2025 16:45        India

బోయింగ్ విమానాలకు సంబంధించి మరోసారి ఆందోళన కలిగించే సంఘటన చోటు చేసుకుంది. బ్రిటిష్ ఎయిర్వేస్‌కు చెందిన బోయింగ్ 787/8 మోడల్ విమానం BA35 నెంబర్‌తో లండన్ హిత్రో నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ విమానంలో 360 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణం మొదలైన దాదాపు 30 నిమిషాల తర్వాత, విమానం 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో రెక్కల దగ్గర ఉన్న ఫ్లాప్స్ నుంచి పొగలు రావడం గమనించారు. ఈ పరిస్థితిని గమనించిన పైలట్ అప్రమత్తమై, విమానాన్ని వెంటనే హిత్రో ఎయిర్‌పోర్ట్‌కు తిరిగివెళ్లి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా బాగుండగా, ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కాగా ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలోనూ ఇదే బోయింగ్ 787/8 మోడల్ వాడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మోడల్ విమానాల భద్రతపై పలు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అధికారిక వివరాల ప్రకారం, పొగలు రావడానికి కారణమైన సాంకేతిక లోపం గురించి బోయింగ్ సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి.

 ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrpradesh #flight #london #12000 #feet #technical #issue #passengers #flight